Nov 07,2022 22:40

ప్రజాశక్తి-జగ్గయ్యపేట 

పట్టణంలో 4వ సచివాలయం 12వ వార్డ్‌ ధనంబోర్డు లో సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు సామినేని ఉదయభాను నిర్వహిం చారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరిస్తూ వారికి ఇతర సమస్యలను ఉంటే అడిగి తెలుసుకుని అధికారుల సమక్షంలో పరిష్కరించారు. ఈ సందర్భంగా ఉదయ భాను మాట్లాడుతూ సంక్షేమం, అభివద్ధి రెండు కళ్ళుగా రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పరిపాలన సాగిస్తున్నా రన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని, అవినీతికి అక్రమాలకు తావు లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందే విధంగా బటన్‌ నొక్కి డెబిట్‌ ద్వారా లబ్ధిదారులకు పథకాలు అందజేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులు తెలిపిన పైపులైను, బోర్లు మరమ్మత్తులు, డ్రైన్లు ఏర్పాటుకు సంబంధించి సమస్య లను పరిష్కరిం చాలని అధికారులను ఆదేశించారు. నిరంతరం వెలుగుతున్న వీధిలైట్లు పరిశీలించడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌లు తుమ్మల ప్రభాకర్‌, హఫీజున్నిసా ఫిరోజ్‌ ఖాన్‌, పట్టణ యువజన విభాగం అధ్యక్షులు ఆవాల భవానీ ప్రసాద్‌ పాల్గొన్నారు.