Feb 04,2023 00:32

పర్యటిస్తున్న ప్రభుత్వ విప్‌ ధర్మశ్రీ

ప్రజాశక్తి-రోలగుంట:ప్రజా రంజక పాలన సీఎం జగన్‌మోహన్‌రెడ్డతోనే సాధ్యమని ప్రభుత్వ విప్‌, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మండలంలోని బుచ్చంపేట పంచాయతీ బుర్రంపేట గ్రామంలలో నిర్వహించారు. గడపగడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల బుక్‌లెట్‌లను పంపిణీ చేశారు. పథకాలు అందకపోతే సచివాలయాన్ని సంప్రదిం చాలన్నారు. ప్రభుత్వం వచ్చిన నాటి నుండి నేటి వరకు ప్రతి కుటుంబానికి వచ్చే సంక్షేమ పథకాలు వివరాలను వివరించారు. అవినీతి రహితంగా లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దన్నారు. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్‌కు అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.