ప్రజాశక్తి - గోనెగండ్ల
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అవినీతి సొమ్ముతో 23 మంది ఎమ్మెల్యేలను కొన్న చరిత్ర చంద్రబాబు నాయుడుదని ఎమ్మెల్సీ, వైసిపి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, కర్నూలు నగర మేయర్ బివై.రామయ్య విమర్శించారు. ఆదివారం గోనెగండ్ల మండలం హెచ్.కైరవాడీ, గోనెగండ్లలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. గోనెగండ్లలో రూ.2.5 కోట్లతో చేపట్టనున్న ప్రధానమంత్రి జలజీవన్ మిషన్ పనులకు భూమి పూజ చేశారు. వైసిపి సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, ఎంపిపి నసురుద్దీన్, సర్పంచి హైమావతి, ఆర్‌డబ్ల్యుఎస్ డిఇ సాంబయ్య, ఎఇ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం స్థానిక బాష ఫంక్షన్ హాలులో మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన వైసిపి నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చంద్రబాబు సత్య హరిశ్చంద్రునికి వారసుడు కాదని విమర్శించారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం నిధుల్లో రూ.వందల కోట్లను అవినీతితో నొక్కేశారని, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని అన్నారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ నజీర్ అహ్మద్, వైస్ ఎంపిపి వెంకటరామిరెడ్డి, సింగిల్‌విండో ప్రెసిడెంట్ తిరుమలరెడ్డి, మార్కెట్ యార్డు వైస్ ఛైర్మన్ మన్సూర్, మాజీ కో ఆప్షన్ సభ్యులు బందే నవాజ్, మండల కన్వీనర్ దొరబాబు నాయుడు, కాశిరెడ్డి, భాస్కర్ రెడ్డి, బగిలి ఉస్మాన్, రఫీ, పద్మనాభం పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ










