అవినీతి నిర్మూలన ద్వారానే సమాజ అభివద్ధి
ప్రజాశక్తి - క్యాంపస్ : అవినీతి నిర్మూలన కొరకు నిర్వహించిన అవగాహన మారథాన్ రన్ ర్యాలీలో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ రాంప్రసాద్, విజిలెన్స్ ప్రధాన అధికారి కోర్లం గిరిధర్ సంయుక్తంగా విజిలెన్స్ అవేర్నెస్ వారోత్సవం గురించి ప్రజలకు వివరించి అవినీతి నిర్మూలన ద్వారానే సమాజ అభివద్ధి సాధ్యమని అన్నారు. ఆదివారం ఉదయం అవినీతి నిర్మూలన విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ముగింపు రోజు సందర్భంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరుపతి ప్రాంతీయ కార్యాలయం వారి ఆధ్వర్యంలో ''అవినీతిని నిర్మూలిద్దాం... భారత దేశాన్ని కాపాడుదాం..'' అను నినాదంతో 'విజిలెన్స్ మారథాన్ రన్ ' కార్యక్రమం స్థానిక ఎస్వీ యూనివర్సిటీ లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం నుండి తిరుపతి టౌన్ క్లబ్ వరకు జరిగిన ర్యాలీ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ , విజిలెన్స్ ప్రధాన అధికారి మాట్లాడుతూ అవినీతి నిర్మూలన ద్వారానే సమ సమాజ స్థాపన సమాజాభివద్ధి సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉప ప్రాంతీయ కార్యాలయ అధికారి దాస్యం శ్రీనివాస్, అభిమన్యు, ఎల్డిఎం సుభాష్, ప్రాంతీయ అధికారి సలహాదారు గోపాల కష్ణ, గుంటూరు రవికుమార్ చీఫ్ మేనేజర్, ఇతర బ్రాంచ్ ల ప్రధాన మేనేజర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.










