Feb 05,2023 22:45

ప్రజాశక్తి -తిరువూరు 

సరైన అవగాహనతోనే కేన్సర్‌ వంటి వ్యాధులను నియంత్రణ చేయవచ్చని ప్రముఖ కేన్సర్‌ వ్యాధి నిపుణులు బి. శ్రావణ్‌ కుమార్‌ తెలిపారు. మద్య పానం, ధూమ పానం వంటి చెడు ఆల వాట్లకు దూరంగా ఉంటే క్యాన్సర్‌ వంటి వాటికి దూరంగా ఉండవచ్చని వివరించారు. తిరువూర సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జనవిజ్ఞానవే దిక (జెవివి), సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం క్యాన్సర్‌ పై అవగాహన సదస్సు ఆదివారం జరి గింది. ప్రధాన వక్తగా హాజరైన శ్రావణ్‌ కుమార్‌ మాట్లాడుతూ సరైన వ్యా యామం, పౌష్టికాహారంతో క్యాన్సర్‌ తో పాటు ఇతర వ్యాధులను కూడా నియంత్రణ చేయ వచ్చని తెలిపారు. ఇప్పుడు క్యాన్సర్‌ ను నివారించదగ్గ వ్యాధిగానే పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు. ఈకార్యక్రమంలో ప్రముఖ వైద్యులు వి. రవీంద్ర, జెవివి నాయ కులు ఎం.హరికష్ణ, ఎల్‌. గంగాధర్‌, కె. పాపారావు, డి.సుదర్శన్‌, ఎం.రాంప్రదీ ప్‌, పి.వి,శరత్‌, పి.శీనయ్య, ఎం. నాగేం ద్రప్రసాద్‌ పాల్గొన్నారు.