తెనాలి:మలేరియా వ్యాప్తికి కారణాలు తెలుసుకుని, నివా రణోపాయాలను పాటిస్తే మలే రియాకు దూరంగా ఉండ వచ్చని వైధ్యాధికారిణి డాక్టర్ వి.దేవికా రాణి అన్నారు. మలే రియా మాసోత్స వాల్లో భాగంగా శుక్రవారం పట్టణంలో మలేరియా విభాగం, వైద్య విభాగం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దేవికారాణి మాటా ్లడుతూ ఇంటి ఆవరణలో నీటి నిల్వలు లేకుంగా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమ తెరలను వాడాలని సూచించారు. ఎవరైనా జ్వరపీడి తులుగా ఉంటే సమీపంలోని ప్రభుత్వ వైద్య శాలను లేదా ఆరోగ్య కేంద్రంలో సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవాలన్నారు. అనంతరం పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి ఎస్.ఉమాకాంత్ మాటాడారు. ప్రజల అవ గాహన నిమిత్తం కరపత్రాలను పంపిణీ చేశారు. కార్య క్రమం లో ఆరోగ్య సిబ్బంది మల్లేశ్వరరావు, టి. ప్రసాద్, రషీద్, నవీన్, ఎం.రత్నాకర్, కమాలకర్ గుప్తా, డి.సత్యం, దరియా వలి, జయంతి, భవాని పాల్గొన్నారు.










