Oct 08,2023 21:18

ఆ(ట)వేట షురూ..

ు్కపో
ప్రజాశక్తి - కడప ప్రతినిధి
జిల్లాలో క్రికెట్‌ ఫీవర్‌ మొదలైంది. పొరుగు రాష్ట్రమైన తమిళ నాడులోని చెన్నరు పట్టణంలోని చెపాక్‌ స్టేడియంలో ఇండియా- ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం క్రికెట్‌ వన్డే మ్యాచ్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సమాన బలాలు కలిగిన జట్ల మధ్య ఉత్కంఠ భరితమైన పోటీ నెలకొనడంతో యువత టెలివిజన్‌ సెట్లకు అతుక్కు పోయింది. ఇదిలాఉం డగా సమాన జట్ల మధ్య క్రికెట్‌ పోటీ నెలకొ నడంతో ఎనలేని ఉత్కంఠ నెలకొంది. ఈనేపథ్యంలో ఎవరు గెలు స్తారనే అంచనాలు రావడం సహజం. దీనికి అనుబంధంగా బంతికి బంతికి బెట్టింగులు కాయడం సర్వసాధారణంగా మారింది. దీన్ని సొమ్ము చేసుకునేందు కు బెట్టింగ్‌ గ్యాంగులు రంగంలోకి దిగడం షరామామూలే. ఈనేపథ్యంలో యువతలో సాంకేతికత పట్ల అవగా హన కలిగిన నేపథ్యంలో యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుని ఆన్‌లైన్‌ బెట్టింగుల వలలో పడడం తెలిసిందే. ఆన్‌లైన్‌, ఆప్‌లైన్‌ అనే తేడా లేకుండా బెట్టింగుల జాడ్యం బారిన పడిన కారణంగా చాలా కుటుం బాలు వీధిన పడిన ఉదంతాలు అనేకం. గతంలో సాధారణ క్రికెట్‌ మ్యాచ్‌లకే జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున లక్షలాది రూపాయల్లో బెట్టింగులు నడిచిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పోలీసులు తనిఖీలు చేయడంతో బెట్టింగు రా యుళ్లు పట్టుబడిన ఉదంతాలు అనేకం. ఇక వన్డే ప్రపంచకప్‌ అన గానే బెట్టింగ్‌రాయుళ్ల ఏస్థాయిలో పేట్రేగిపోతారో ఊహించుకోవా ల్సిందే. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో జిల్లా పోలీస్‌ యంత్రాం గం అప్రమత్తమైంది.కడప, ప్రొద్దుటూరు ప్రాంతాల్లోని పలు లాడ్జీలు, ఇతర ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేసింది. జిల్లాలో ఒకవైపు బెట్టింగ్‌ రాయుళ్లు, మరోవైపు పోలీసుల తనిఖీల మధ్య క్రికెట్‌ ఆ(వే)ట ఉత్కంఠను రేపుతోంది. ఇందులో ఎవరు ఓడుతారో, ఎవరు గెలుస్తారో కాలమే తేల్చనుంది. కడప, ప్రొద్దుటూరు, మైదుకూరులలో తనిఖీలు
ప్రజాశక్తి - కడప అర్బన్‌ / ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌)/ చాపాడు
కడప నగరంలోని వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లాడ్జీలలో పోలీస్‌ అధికారులు, సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆదివారం ఎస్‌పి సిద్ధార్థ కౌశల్‌ పరిశీలించారు. లాడ్జిలోని రిజిస్టర్లను పరిశీలించి బస చేసిన వారి వివరాలు ఆరా తీయాలని సిబ్బందికి సూచించారు. సిబ్బంది కి పలు సూచనలు చేశారు. అనుమాస్పదంగా ఉండే వ్యక్తులు ఎవరైనా వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని లాడ్జీ నిర్వహకులకు తెలియచేయాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్‌పి వెంట కడప డిఎస్‌పి ఎస్‌.ఎం.డి షరీఫ్‌, ఎస్‌.బి ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌ రెడ్డి, వన్‌ టౌన్‌ సిఐ నాగరాజు, సిఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ లు, సిబ్బంది ఉన్నారు.
ప్రొద్దుటూరులో క్రికెట్‌ బెట్టింగ్‌ బెట్టింగ్‌ స్థావరాలపై పలీసులు దాడులు చేశారు. 30 మందికి పైగా క్రికెట్‌ బుకీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారందరిని మైదుకూరు, జమ్మలమడుగు బైపాస్‌ రోడ్డులోని శ్రీదేవి కళ్యాణ మండపంలో ఉంచారు. అక్కడి నుంచి ఎస్‌పి ఎదుట హాజరు పరిచేందుకు వాహనాల్లో కడపకు తీసుకెళ్లారు. మరి కొందరు బుకీల కోసం పోలీసులు లాడ్జిల్లోనూ ఇతర స్థావరాలల్లో
మైదుకూరులో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఆదేశాల మేరకు క్రికెట్‌ బెట్టింగ్‌, మట్కాల పై ఉక్కు పాదం మోపుతామని అర్బన్‌ సిఐ మస్తాన్‌ సూచించారు. ఆదివారం క్రికెట్‌ బెట్టింగ్‌, మట్కా ల పై తనిఖీలు నిర్వహించారు. మైదుకూరులో పలు లాడ్జీలు, అనుమానం ఉన్న ప్రదేశాలలో పోలీసుల దాడులు నిర్వహించారు. అనుమానం ఉన్న వ్యక్తులు లాడ్జిలకు వస్తే సమాచారం అందించాలన్న సిఐ నిర్వహకులకు సూచించారు.