ప్రజాశక్తి - విజయవాడ : తమిళనాడు, వెల్లూర్, సిరిపురంలోని శ్రీ లక్ష్మీనారాయణి గోల్డెన్ టెంపుల్‌లో ఈనెల 6న జరిగిన శ్రీ సాయి నాట్యాంజలి పైన్ ఆర్ట్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఏడవ జాతీయ స్థాయి నంది డాన్స్ పెస్టివల్ విభాగంలో విజయవాడకు చెందిన మోదుకూరి బాలసరస్వతి అవార్డు సాధించింది. వన్‌టౌన్ కొత్తపేటలో గల ఎస్‌కెపివివి హిందూ హైస్కూల్‌లో ఎనిమిదో తరగతి విద్యార్థి బాలసరస్వతి కూచిపూడి ప్లేట్ డాన్స్ విభాగంలో శ్రీ నారాయణి నంది అవార్డ్ సాధించింది. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మిని బాలసరస్వతి, ఆమె తల్లితండ్రులు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. విజేతగా నిలిచిన చిన్నారిని మేయర్ అభినందించి భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. బాలికకు శిక్షణ కల్పించిన కోచ్‌ను అభినందించారు.










