- తిరుపతి జిల్లా సిఐటియు ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు బి.వి.రమణయ్య
ప్రజాశక్తి - గూడూరు : సి.ఐ.టి.యు ఆటో డ్రైవర్స్ యూనియన్, కోట, విద్యానగర్, టాటా మ్యాజిక్ ఆటో డ్రైవర్స్ జనరల్ బాడీ సమావేశం గూడూరు సి.ఐ.టి.యు కార్యాలయంలో శుక్రవారం పట్టణ అధ్యక్షులు పి. లక్ష్మయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా గూడురు శాఖ కార్యదర్శి జోగి శివకుమార్, పాల్గొనడం జరిగింది. సమావేశంలో సి.ఐ.టి.యు తిరుపతి జిల్లా ఆటో డ్రైవర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి.వి.రమణయ్య మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫారం వేసుకొని బండికి సంబంధించిన కాగితాలు అన్నీ సరిగా ఉంచుకొని, తమ కుటుంబాన్ని తలుచుకొని, ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా డ్రైవింగ్ చేయాలని ప్రయాణికుల పట్ల సత్ప్రవర్తన, మర్యాదపూర్వకంగా మెలగాలని సూచించడం జరిగింది. ఆటో కార్మికులు దీర్ఘకాలికంగా ఉన్న పలు సమస్యలు పరిష్కారంకై "ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్" ఇచ్చిన పిలుపుమేరకు (AIRTWF) అక్టోబర్ ఆరవ తేదీ చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్మిక రవాణా రంగా కార్మికులకు వెల్ఫేర్ బోర్డు సాధనకై జీవో నెంబర్ 21న రద్దు చేయాలని, గ్రీన్ టాక్స్ రద్దు చేయాలని పెంచిన త్రైమాసిక రహదారి పన్నులను రద్దు చేయాలని, వాహనాలు నిలుపుకునేందుకు పార్కింగ్ స్థలాలు కేటాయించాలని ఆటోలు ట్రక్కులు, ఇతర వాహనాలు కొనుగోలుకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలని డ్రైవర్లకు షెడ్లు ఎంప్లాయిమెంట్, జీవో సవరించాలని, పెంచిన పెట్రోల్, డీజిల్, పెనాల్టీలు తగ్గించాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పై సమస్యలపై చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అనంతరం నూతన కమిటి ఎన్నిక ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షులుగా శ్రీపతి పాల్, ఉపాధ్యక్షులుగా చనుమూరు. సుధాకర్, కార్యదర్శి తురక. వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి ఏ.మురళి, ట్రెజరర్ మల్లి.గురవయ్యను, కమిటి సభ్యులుగా టీ.శ్రీనివాసులు రెడ్డి బల్లి పవన్, ఇ.మణి, ఎం.మహేష్ తదితరులు ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ సహాయ కార్యదర్శి బి. రమేష్, బి.చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.










