Oct 09,2023 23:20

చెక్కు అందజేస్తున్న కమిషనర్‌ కీర్తి చేకూరి

గుంటూరు: కార్మికుల కుటుంబాలకు జిఎంసి అండగా ఉం టుందని, కార్మికులకు అందాల్సిన పరిహారాలు వెంటనే అందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నగర నగర కమిషనర్‌ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజారోగ్య విభాగంలో అవుట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న ఆగి పోగు అజరుకుమార్‌ ఇటీవల అనారోగ్యంతో మర ణిం చారు. అజరుకుమార్‌ భార్య సమాధానంకు కమిషనర్‌ సోమవారం రూ.2 లక్షల చెక్కును అందజేశారు. జిఎంసి నుండి రావాల్సిన ఇతర పరి హారాలు, పిఎఫ్‌ త్వరిత గతిన విడుదల అయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబం ధిత అధికారులను ఆదేశించామని కమిషనర్‌ తెలిపారు. కార్మికులు తమ సమస్యలపై ప్రతి గురువారం జరిగే కార్మికుల ప్రత్యేక గ్రీవెన్స్‌లో అర్జీలు అందించవచ్చని తెలిపారు.