ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో 2022 ఏప్రిల్ నుండి 2023 మార్చి 31 ఆర్థిక సంవత్సరం వరకు నార్పల ఎంపీడీవో కార్యాలయంకు సంబంధించిన వివిధ ఖర్చులు తదితర వాటి గురించి రాష్ట్ర ఆడిటింగ్ సభ్యులు సీనియర్ ఆడిటర్ చంద్రశేఖర్ రెడ్డి, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఉమాదేవి శనివారం ఎంపీడీవో కార్యాలయంలో ఆడిటింగ్ నిర్వహించారు. కార్యాలయంలోని వివిధ రిజిస్టర్లు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అదేవిధంగా స్థానిక సిబ్బందితో సందేహాలను నివృత్తి చేసుకుంటూ ఆడిటింగ్ కొనసాగించారు. వారితో పాటు కార్యాలయ పర్యవేక్షకురాలు ఉమాదేవి, సీనియర్ అసిస్టెంట్ నూర్ మొహమ్మద్ ,జూలియర్ అసిస్టెంట్ నరేంద్ర, టైపిస్ట్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.










