ప్రజాశక్తి-ఎన్టీఆర్ జిల్లా : వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామ శివారులో రంగాపురం గ్రామానికి సమీపంలో గత 90 సంవత్సరాల నుండి వాగు పోరంబోకు భూమిపై ఓ భూస్వామి కన్ను పడింది. ఈ భూమిని సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న పేదలపై చెన్నారావు పాలెం గ్రామానికి చెందిన పత్తిపాటి రాము భూస్వామి కక్ష గట్టారు. గత ఐదు సంవత్సరాల నుంచి పేదలపై దాడి చేస్తూ అక్కడ సాగు చేస్తున్న పేదలను వెళ్ళగొట్టాలని ప్రయత్నంలో భాగంగా అనేక సందర్భాల్లో దాడి చేయడానికి ప్రయత్నిస్తే భూసామి చేసే ప్రయత్నాల్ని భయపడకుండా ధైర్యంగా సాగుచేసుకుంటున్నారు. పేద రైతు ఈ సంవత్సరం ములగ పంటను సాగు చేయగా, భూస్వామి తన భూమికి అడ్డంగా పేదలు ఉన్నారని అక్కస్సుతో ములగ మొక్కలను నిర్ధాక్షణంగా ధ్వంసం వేశారు. ములగ మొక్కలను పారేశారు. విషయంపై స్థానిక రెవిన్యూ అధికారులకు స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన కనీసం పోలీసులు పిలిచి విచారించలేదని పేదరైతులు ఆపోతున్నారు.
తక్షణమే అధికారులు స్పందించి పేదలు సాగు చేసుకున్న రైతులకు రక్షణ కల్పించాలని భూస్వాములు దాడులు పత్తిపాటి రాము ఆక్రమణ ఉన్న భూమి సర్వే చేసి పేద రైతులని కాపాడాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సుందర్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.










