సాధించిన పతకాలతో క్రీడాకారులు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఈనెల 21వ తేదీ నుండి 25 వరకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో జిల్లా క్రీడాకారులు 40 పతకాలు సాధించి సత్తా చాటారు. ఇందులో 12 బంగారు, 12 రజత, 16 కాంస్య పతకాలు ఉన్నాయి. ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఎనిమిది మంది అథ్లెట్స్ జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. వీరిలో జి.లక్ష్మి, టి.లక్ష్మి, ఎం.హరీష్, ఎం.శారద, డి.ఉదరు, బి.హరీష్, కె.సుశాంత్, బి.చాందిని ఉన్నారు. రాష్ట్ర పోటీల్లో పతకాలు సాధించిన వారిని, జాతీయ పోటీలకు ఎంపికైన క్రీడాకారులను కోచ్ మేనేజర్‌ను జిల్లా అథ్లెటిక్ సంఘ సభ్యులు అభినందించారు.










