
ప్రజాశక్తి - వన్‌టౌన్ : రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో తమ కళాశాల విద్యార్ధి అత్యంత ప్రతిభను కనబరిచి బహుమతిని సాధించారని కేబీఎన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.నారాయణరావు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం కళాశాలలో విద్యార్థినికి అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ నారాయణరావు మాట్లాడుతూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో తమ కళాశాల విద్యార్థి సుభాష్ హైజంప్‌లో 1.65 మీటర్లు ఎత్తు ఎగిరి రజిత పతకాన్ని సాధించాడని పేర్కొన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన పోటీల్లో బహుమతిని పొందారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్ధిని, అతనిని తీర్చిదిద్దిని ఫిజికల్ డైరెక్టర్ డీ. హేమచంద్రరావులను కళాశాల కార్యదర్శి తూనికుంట్ల శ్రీనివాసు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, పీఎల్ రమేష్‌లు అభినందించారు.