ప్రజాశక్తి - దేవరాపల్లి : ఉమ్మడి విశాఖ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో దేవరాపల్లి మండలానికి చెందిన విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఈ నెల 11న అనకాపల్లి ఏఎంఏఎల్ కాలేజీలో పాఠశాల స్థాయి గేమ్స్ ఫెడరేషన్ అండర్-19 బాలుర అథ్లెటిక్స్ క్రీడా పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో దేవరాపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి కక్కల దుర్గాప్రసాద్ 200, 400 మీటర్ల రన్నింగ్‌లో ప్రథమ స్థానం, డిస్కు త్రోలో ప్రథమ స్థానం సాధించగా, షాట్‌పుట్‌లో ద్వితీయ స్థానం సాధించినట్లు పాఠశాల ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయులు పాండురంగారావు తెలిపారు. దుర్గాప్రసాద్‌ను, తర్ఫీదునిచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు టి.నాగేశ్వరరావును హెచ్‌ఎం పాండురంగారావుతో పాటు ఇతర ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.
వేచలం విద్యార్థుల ప్రతిభ
జిల్లా అథ్లెటిక్స్ క్రీడల్లో మండలంలోని వేచలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అండర్-14 విభాగంలో రన్నింగ్ ప్రథమ, ద్వితీయ, తృతీయ, స్థానాలు సాధించారు. జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలకు సుధారాణి, స్నేహ, అను ఎంపికయ్యారు. విద్యార్థులను, పిడి తమ్మునాయుడను పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవుపల్లి నరసింహమూర్తి, సర్పంచ్ నాగిరెడ్డి శఠారినాయుడు, ఎంపీటీసీ సభ్యులు లక్ష్మీ బలరాం, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ రెడ్డి శ్రీనివాస్, అభినందించారు.










