ప్రజాశక్తి-ఉక్కునగరం : జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివశంకర్ రెడ్డి పర్యవేక్షణలో స్టీల్‌ప్లాంట్‌లో ప్లాంట్ లెవెల్ మాక్ డ్రిల్ బుధవారం నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్‌లోని ఎనర్జీ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్. గ్యాస్ మిక్సింగ్ స్టేషన్‌లో కల్పిత గ్యాస్ లీక్ చేసి, అనంతరం ఆన్ సైడ్ ఎమర్జెన్సీ ప్రిపేర్ చేయడానికి ఈ డ్రిల్ ఏర్పాటు చేశారు. మాక్ డ్రిల్‌లో వైద్య సేవలు, గ్యాస్ భద్రత వంటి అత్యవసర సేవా విభాగాలు, సేఫ్టీ డిపార్ట్మెంట్ ఎన్విరాన్మెంట్ మేనేజ్‌మెంట్, డిపార్ట్మెంట్ సిఐఎస్‌ఎఫ్, సెక్యూరిటీ హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్ పాల్గొన్నాయి. గ్యాస్ సేఫ్టీ టీం వెంటనే గ్యాస్ మానిటర్లు, ఆర్టిఫిషియల్ రెస్పిరేటర్లతో ఘటన స్థలానికి చేరుకొని పేలుడు పదార్థాల సాంద్రతను విశ్లేషించారు. రెస్యూ టీం వచ్చేవరకు బాధితులకు ఆక్సిజన్ అందించారు. టీఐఎస్‌ఎఫ్ భద్రత సిబ్బంది రిసఈ్క ఆపరేషన్లు చేపట్టాయి. సెల్ఫ్ కంటెంట్ బ్రీతింగ్ ఆపరేటర్స్ ఇతర అత్యవసర ప్రతిస్పందన పరికరాలను ఉపయోగించి బాధిత వ్యక్తులను రక్షించడానికి స్పాట్ నుంచి తరలింపు వంటి అనే ప్రక్రియలను మాక్ డ్రిల్‌లో చేశారు. స్టీల్ ప్లాంట్ బృందం కృషిని . శివశంకర్ రెడ్డి ప్రశంసించారు. కార్మికుల భద్రత కోసం మరిన్ని సూచనలు చేశారు. స్టీల్‌ప్లాంట్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎంవిఎస్ కష్ణయ్య మార్గదర్శకంలో ఈ ప్లాంట్ లెవెల్ మాక్ డ్రిల్ నిర్వహించారు.కార్యక్రమంలో స్టీల్‌ప్లాంట్ సీనియర్ అధికారులు కె.సుధాకర్, ఎంకె. రావు ఉత్తమ్ బ్రహ్మ పాల్గొన్నారు.
మాక్‌డ్రిల్ పర్యవేక్షిస్తున్న శివశంకర్‌రెడ్డి










