ప్రజాశక్తి - జీలుగుమిల్లి
మండలంలో అటవీశాఖ ఆధ్వర్యంలో నాటిన కొత్త ప్లాంటేషన్‌లను విశాఖపట్నం నుంచి వచ్చిన అటవీశాఖ ప్రత్యేక బృందం శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలోని చంద్రమ్మ కాలనీ, కామయ్యపాలెంలో గత సంవత్సరంలో నాటిన మారు జాతి మొక్కల ప్లాంటేషన్‌లను పరిశీలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాంటేషన్‌లలో సంవత్సర కాలం నాటికే మొక్కలు సజావుగా పెరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. అదే విధంగా పలు రకాల మొక్కలకు కావాల్సిన పోషకాలు సరైన సమయంలో అందిస్తే త్వరగా వృద్ది చెందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ అటవీ శాఖ రేంజ్ అధికారి గంగరాజు, జంగారెడ్డి గూడెం అటవీ శాఖ రేంజ్ అధికారి శ్రీవాణీ, ఎఫ్‌బిఒ కిరణ్, ఎఫ్‌ఆర్‌ఒ శ్రీనివాస్, ఎఫ్‌బిఒ మారేష్, పోసి పాల్గొన్నారు.










