అటవీశాఖ క్లియరెన్స్ ఇస్తేనే 2 గంటల తరువాత చిన్న పిల్లలకు నడక దారిలో అనుమతి
అటవీశాఖ క్లియరెన్స్ ఇస్తేనే 2 గంటల తరువాత
చిన్న పిల్లలకు నడక దారిలో అనుమతి
తిరుమలలో క్యూలైన్లు పరిశీలించిన టీటీడీ ఛైర్మన్
ప్రజాశక్తి- తిరుమల: అలిపిరి నుంచి తిరుమలకు నడచి వచ్చే మార్గంలో వన్య మగాల నుండి ఎలాంటి ముప్పు లేదని అటవీశాఖ అధికారులు ధవీకరిస్తేనే 12 ఏళ్ళ లోపు పిల్లల విషయంలో ఆంక్షలు సడలిస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేశారు. భక్తుల భద్రతే తమకు ముఖ్యమని ఆయన చెప్పారు. తిరుమలలో భక్తుల రద్దీ నేపథ్యంలో సోమవారం చైర్మన్ క్యూలైన్లను పరిశీలించారు. భక్తులకు ఆహారం, తాగునీరు, కాఫీ, టీ, మజ్జిగ అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి చిన్న ఇబ్బంది కలగకుండా మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. గోగర్భం సర్కిల్ నుండి కష్ణతేజ సర్కిల్ వరకు క్యూ లైన్లను పరిశీలించారు. అనంతరం చైర్మన్ కరుణాకర రెడ్డి మీడియాతో మాట్లాడారు. పెరటాశి మాసం, సెలవుల కారణంగా గత నాలుగు రోజులుగా తిరుమలలో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందన్నారు. క్యూలైన్లు 4 నుండి 5 కిలోమీటర్ల దూరం వెళ్లాయని, ఇలాంటి భక్తులకు త్వరిత గతిన స్వామి వారి దర్శనం చేయించాలనే సంకల్పంతో విఐపి బ్రేక్, సుపథం, స్లాటెడ్ దర్శనం టోకెన్ల జారీ కూడా రద్దు చేసినట్లు ఛైర్మన్ చెప్పారు. క్యూలైన్లలో ఉండే భక్తులు ఎక్కడా అసహనానికి లోను కాకుండా అవసరమైన తగిన వసతులు కల్పించామని చెప్పారు. అక్టోబరు 15 నుండి జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలకు పెద్దసంఖ్యలో భక్తులు హాజరవుతారనే అంచనాతో అవసరమైన ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకుంటుంటున్నామని తెలిపారు.
అధికారుల పనితీరు బ్రహ్మాండం
విపరీత మైన భక్తుల రద్దీ ఉండటంతో ఈవో, జేఈవో, సివిఎస్వో, ఆరోగ్యం ఇతర అధికారులందరూ ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ క్యూలైన్లు పరిశీలిస్తూ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని చైర్మన్ చెప్పారు. తిరుమలకు భక్తులు పోటెత్తడంతో వీరు ప్రత్యక్షంగా ఏర్పాట్లు పరిశీలిస్తూ భక్తులకు చిన్న ఇబ్బంది కూడా కలక్కుండా పని చేస్తున్నారని చైర్మన్ అభినందించారు. కార్యక్రమంలో జేఈవో వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్, ఆరోగ్యాధికారి డాక్టర్ శ్రీదేవి, డిఎఫ్వో శ్రీనివాసులు, వీజీవోలు బాలిరెడ్డి, గిరిధర్, డిఎస్పీ భాస్కర్ రెడ్డి, డిప్యూటీ ఈవో రాజేంద్ర, సిఐలు జగన్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ ఉన్నారు.










