May 09,2023 23:55

అటవీ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సిసిఎఫ్‌ శ్రీకాంత్‌నాథరెడ్డి

అల్లూరి జిల్లా సిసిఎఫ్‌ శ్రీకాంత్‌నాథరెడ్డి
ప్రజాశక్తి -సీలేరు
ఏజెన్సీలోని అటవీ సంపదను సంరక్షించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు (సిసిఎఫ్‌) శ్రీకాంత్‌నాథరెడ్డి రేంజ్‌ అధికారి శ్రీనివాస్‌ను ఆదేశించారు. జీకే వీధి మండలం సీలేరు అటవీ రేంజ్‌ పరిధిలో మంగళవారం బీటు తనిఖీలు విస్తృతంగా చేపట్టారు. స్థానిక అటవీశాఖ కలప డిపోలో టేకు దుంగలు వేలంపాటలో సిసిఎఫ్‌ శ్రీకాంత్‌నాథ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం సీలేరు అటవీశాఖ కార్యాలయంలో ఆయన సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణం కాలుష్య నివారణపై సిబ్బందికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. అటవీ సంపద దొంగలపాల కాకుండా కట్టుదట్టమైన భద్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అటవీ సంపదను ఎక్కువగా పెంచడం వలన పర్యావరణానికి ఎంతగానో దోహదపడతాయని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌ఓ సూర్యనారాయణ, సబ్‌ డిఎఫ్‌ఓ ఎన్‌ఎస్‌బి రాజు, దారకొండ ఎఫ్‌ఎస్‌ఓలు సతీష్‌, వివేకానందరావు సిబ్బంది పాల్గొన్నారు.