Nov 27,2022 23:28

మాట్లాడుతున్న గిరిజన సంఘం నేత సీతారామయ్య

ప్రజాశక్తి -కూనవరం : అటవీ హక్కుల చట్టం-2005ను అమలు చేసి, మన్యంలోని గిరిజనులందరికీ సాగులో ఉన్న భూమికి హక్కు పత్రాలు ఇవ్వాలని గిరిజన సంఘం నేత పాయం సీతారామయ్య డిమాండ్‌ చేసారు. ఆదివారం నిర్వహించిన గిరిజన సంఘం సమావేశంలో మాట్లాడుతూ, ఇంటి స్థలం లేని గిరిజనులకు అటవీ భూముల్లో ఇల్లు కట్టుకోవడానికి చట్ట ప్రకారం ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరారు. అటవీ హక్కుల చట్టంపై సంబంధిత అధికారులు అవగాహన పెంచుకోవాలని, మన్యవాసులకు ప్రయోజనకరంగా ఉండేలా చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అటవీహక్కుల చట్టం అమలులో నిర్లక్ష్యం చూపడం సరికాదని, రాష్ట్ర అధికారులు కూడా అదేబాటన నడవడంతో గిరిజనుల అటవీ హక్కుల ఫలాలు పూర్తిస్థాయిలో అందని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. 2005కు ముందు సాగుచేస్తున్న గిరిజనులకు అటవీ హక్కుల చట్టం కింద సాగుహక్కు పట్టాలు ఇవ్వకపోగా, అంతకుముందే ఇళ్లు కట్టుకున్న గిరిజనులను సైతం అటవీ అధికారులు నోటీసులు ఇచ్చి బెదిరింపులకు పాల్పడడం దారుణమన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కొమరం పెంటయ్య, ఎంపిటిసి అమ్మాజీ, సర్పంచ్‌లు శంకర్‌, నాగమణి, బొగ్గా వెంకమ్మ, రామయ్య పాల్గొన్నారు