Feb 27,2023 00:11
తైక్వాండోలో పాల్గొన్న విద్యార్థులు

ప్రజాశక్తి-రేపల్లె: రేపల్లె జూనియర్‌ కాలేజ్‌ గ్రౌండ్‌లో సబ్‌ జూనియర్‌ విభాగంలో 12 సంవత్సరాలు 14సంవత్సరాల బాలబాలికలకు తైక్వాండో ఉమ్మడి గుంటూరు జిల్లాల చాంపియన్షిప్‌ పోటీలు స్టేట్‌ సెలక్షన్‌ ఫైట్‌ అట్టహాసంగా జరిగాయని డిస్టిక్‌ తైక్వాండో అసోసియేషన్‌ సెక్రటరీ కె జగన్మోహన్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత గుంటూరు జిల్లా నలుమూలల నుంచి 150 మంది క్రీడాకారులు సబ్‌ జూనియర్‌ సీనియర్‌ కేటగిరీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రథమ స్థానం పొందిన బాల బాలికలకు మార్చ్‌ 10,11,12 తేదీలలో విశాఖపట్నంలోని యలమంచిలిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ టోర్నమెంట్‌ న్యూ ఆంధ్రప్రదేశ్‌ తైక్వాండో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్‌ చైర్మన్‌ కట్టా మంగ సుబ్బారావు పాల్గొని మాట్లాడారు. చదువుతోపాటు క్రీడల ద్వారా మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుందని అన్నారు. పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ బి విజయ సారథి, పి శంకర్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.