Aug 29,2023 20:02

కబడ్డీ పోటీలను ప్రారంభిస్తున్న అతిథులు

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
మండలంలోని దొడ్డనగేరి గ్రామంలో చింతలముని స్వాముల వారి 45వ ఆరాధన మహోత్సవం సందర్భంగా జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను జెఎంఆర్‌ యూత్‌ ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభించారు. ఈ పోటీలు రెండు రోజుల పాటు జరుగుతాయని యూత్‌ సభ్యులు తెలిపారు. ప్రతేడాది కబడ్డీ పోటీలను పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పారు. వైసిపి నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.