Sep 22,2023 23:31

ప్రజాశక్తి-అమలాపురం
ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసులను సత్వరం పరిష్కరించే విధం పర్యవేక్షణా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌ సమావేశపు హాల్లో జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన పౌర హక్కుల రక్షణ, ఎస్‌సి, ఎస్‌టిలపై దురాగతాల నివారణ చట్టం అమలుపై జిల్లా అప్రమత్తత పర్యవేక్షణ అధికారులతో జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారాల కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు న్యాయ, పోలీస్‌, రెవెన్యూ సంబం ధిత అధికారులు ప్రత్యేక దష్టి సారించాలన్నారు. ఎస్‌సి, ఎస్‌టి నిరుపేదలకు ఉన్నతి పథకం ద్వారా యూనిట్లు మంజూరు చేస్తూ వారి జీవన ప్రమాణాలు పెంపుదలకు పేదరిక నిర్మూలన కార్యక్రమాల ద్వారా పాటుపడాలన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా ఎస్‌సి, ఎస్‌టిల రిజర్వేషన్లకు అను గుణంగా యూనిట్లు రాయితీలతో మంజూరు చేస్తూ వారి అభ్యున్నతి పాటుపడాలన్నారు. జిల్లా నీటి యజమాన్య సంస్థ ద్వారా గ్రామాలకు దూరంగా ఉన్న ఎస్‌సి, ఎస్‌టి ఆవాసాలకు అప్రోచ్‌ రోడ్లు వేయ డంతో పాటు శ్మశానవాటికలకు అనుసంధాన రోడ్లు ఏర్పాటుకు మండల ప్రణాళికలో కార్యాచరణ రూపొందించి అమలు చేయాలన్నారు. అదేవిధంగా ఆయా సామాజిక వర్గాల ఆవాసాలకు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న బడుగు వికాసం ద్వారా జిల్లా పరిశ్ర మల శాఖ యూనిట్లు రాయితీలతో గ్రౌండ్‌ చేస్తూ ఆయా వర్గాలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలన్నారు జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారులు గ్రామస్థాయిలో గ్రామసభలు నిర్వహించి చైతన్యం తీసుకుని వస్తూ ఔత్సాహిక పారిశ్రామికవే త్తలను ప్రోత్సహిస్తూ నిర్దేశిత లక్ష్యాలు చేరుకోవాలని ఆదేశించారు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఆయా సామాజిక వర్గాల యువతకు పరిశ్రమలు సేవారంగాల సమన్వయంతో ఉపాధి అవకాశాలు పెంపొందించాలన్నారు వసతి గృహాల్లో ఇంటర్నల్‌ వైరింగ్‌ ఆధునికీకరించాలని క్రీడా సామగ్రిని సమకూర్చాలన్నారు. పెట్రోలింగ్‌, సిసి కెమెరాలు నిఘాలో వసతి గహాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 27న గణేష్‌ నిమజ్జనం సందర్భంగా ఎంపిడిఒలు సమన్వయంతో నిమజ్జనం చేపట్టే ఘాట్ల వద్ద లైటింగ్‌ ఏర్పాట్లతో పాటు గజఈతగాళ్లను భక్తుల రక్షణ కొరకు నియమించాలని ఆదేశిం చారు. పోలీసు రెవెన్యూ అధికారులు ఎస్‌సి, ఎస్‌టి సమస్యలపై ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాలని అన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశాలు నిర్వహించడం తో పాటుగా, ప్రతినెల 30న పౌర హక్కుల దినోత్స వం నిర్వహిం చాలన్నారు. జిల్లాలో డివిజన్‌ స్థాయిలో నమోదైన అట్రాసిటీ కేసులు ఎప్పటి కప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండల స్థాయిలో ప్రతి నెల పౌర హక్కుల దినోత్సవ సమావేశాలను తప్పని సరిగా నిర్వహించాలన్నారు. ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ చట్టం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని డివిజన్ల వారీగా ఎస్‌సి, ఎస్‌టి కేసులు పరిష్కార పురోగతిని ఆయన సమీక్షిం చారు. కార్యక్రమంలో జిల్లా ఎస్‌సి ఎస్‌.శ్రీధర్‌ డిఆర్‌ఒ సిహెచ్‌.సత్తి బాబు, సాంఘిక సంక్షేమ సాధికారిత శాఖ జిల్లా అధికారిని పి .జ్యోతిలక్ష్మి దేవి, డిఎస్‌పిలు అంబికా ప్రసాద్‌ రామకృష్ణ, ప్రసాద్‌, వివిధ శాఖలకుచెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.