ఆటోవాలా ఆశాజ్యోతి జగనన్నవైఎస్ఆర్ వాహన మిత్ర సమావేశంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

రాయచోటి టౌన్ : ఆటో వాలాకు అండగా వైఎస్‌ఆర్ వాహన మిత్ర నిలుస్తుందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని జిల్లా రవాణాశాఖాధికారి కార్యాలయంలో జిల్లా రవాణా అధికారి దినేష్ చంద్ర అధ్యక్షతన నిర్వహించిన ఐదవ విడత వైఎస్‌ఆర్ వాహన మిత్ర లబ్ధిదారుల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు జగన్ ప్రభుత్వం ఇస్తున్న ఏటా రూ.10 వేల ఆర్థిక సహాయం ఇస్తుండడం దేశ చరిత్రలో ఎక్కడా లేదన్నారు. వాహన మిత్ర ద్వారా ఐదవ విడతలో రాయచోటి అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా7990 మందికి రూ.7,99,00,000 లబ్ది పొందుతున్నారని చెప్పారు. రాష్ట్ర ఆర్ధిక ఇబ్బందులున్నా సిఎం జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారన్నారు. వైఎస్‌ఆర్ వాహన మిత్ర పథకం కింద ఆటో డ్రైవర్లకు రూ.10 వేల చొప్పున ఐదు విడతల్లో రూ.50 వేలను ఇప్పటి వరకు అందించారన్నారు. ఆటో, ట్యాక్సీ కార్మికులు ఫిట్ నెస్, బీమా, మరమ్మతుల కోసం, రికార్డుల నిర్వహణ కోసం పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా జగన్ చూసి ఆర్థిక సాయాన్ని ఇస్తున్నారని తెలిపారు. వేలాది మంది ప్రయాణికులను రోజు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తూ గొప్ప సేవ చేస్తున్న ఆటో ,ట్యాక్సీ డ్రైవర్ల అన్నదమ్ముళ్లకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆటో స్టాండ్ ఏర్పాటుకు కషి చేస్తామన్నారు. ఆటో వాలాల పట్ల పోలీసులు గౌరవప్రదంగా వ్యవహరించాలని సూచించారు. త్వరలో రాయచోటిలో ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. ఆటో అసోసియేషన్ అధ్యక్షులు విజయభాస్కర్ మాట్లాడుతూ ఆటో వాలాల సమస్యలపై దయచూపి ఐదేళ్లు వరుసగా వైఎస్‌ఆర్ వాహన మిత్ర ద్వారా ఆర్థిక సహాయం అందించారన్నారు. ార్యక్రమంలో మోటార్ వాహనాల తనిఖీ అధికారులు అనిల్ కుమార్, సుబ్బరాయుడు, అజరు కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు,మదనపల్లె పరిశీలకులు హాబీబుల్లా ఖాన్,యువజన విభాగపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదన మోహన్ రెడ్డి, మండల బిసి నాయకుడు పల్లపు రమేష్, ఆసీఫ్ అలీఖాన్, గౌస్ ఖాన్, అల్తాఫ్, ఫయాజ్ అహమ్మద్, జయన్న నాయక్, భాస్కర్, జానం రవీంద్ర యాదవ్, అన్నా సలీం, మాజీ కౌన్సిలర్ ఆనంద రెడ్డి, ట్రాన్స్ పోర్ట్ కానిస్టేబుళ్లు, పెద్దఎత్తున ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.