ఆటోనగర్‌కు మౌలిక సదుపాయాలు కల్పించాలి
- ఆటోమొబైల్ కార్మికులు
ప్రజాశక్తి - శ్రీశైలం ప్రాజెక్ట్
ఆటోనగర్‌కు స్థలాన్ని కెేటాయించి, మౌలిక సదుపాయాలు కల్పించాలని శ్రీశైలం మండలం సున్నిపెంట తాసిల్దార్ రాజేంద్ర సింగ్‌కు ఆటో మొబైల్ కార్మికులు సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఆటోమొబైల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఏ. బెనహర్, గౌరవ అధ్యక్షుడు ఆశీర్వాదం, ఎస్. కే. వలీ మాట్లాడుతూ సుండి పెంట గ్రామ పంచాయతీ పరిధిలో ఆటోమొబైల్ కార్మికులకు ప్రభుత్వం ఆటో నగర్ స్థలాన్ని కేటాయించి మౌలిక వసతులు కల్పించాలన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ దశలో పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చిన వారిలోఅధికంగా వున్నారని, ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకొని ఉపాధి కల్పన లేకపోవడంతో ఆటోమొబైల్, చేతివృత్తులు చేసు కొనుచు హైదరాబాద్- శ్రీశైలం రహదారి పక్కన ఇరు వైపులా కార్మికులుగా, మెకానిక్,ఎల్డర్లు,ఎలక్ట్రిషన్లుగా అనేక రకమైన చేతి వృత్తులు చేసుకుంటూ దాదాపు 150 మందికి ఉపాధి పొందుతున్నారన్నారు. స్పందించిన తహశీల్దార్ ఇరిగేషన్ నుండి గ్రామపంచాయతీ స్థలాన్ని రెవెన్యూకి ఆటోనగర్ సమస్యలను పరిష్కరించబడే విధంగా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు మండల అధ్యక్ష,క ార్యదర్శులు వై.శీను, ఈ. మల్లికార్జున, ఆటోమొబైల్ వర్కర్స్ యూనియన్ నాగ మల్లికార్జున,నాగూర్ వలి,షేక్షావలి,బాబు,మస్తాన్,ఈర్ఫాన్,సుల్తాను తదితరులు పాల్గొన్నారు.