ఆటో నగర్ స్థలాన్ని పరిశీలిస్తున్న జేసీ
ప్రజాశక్తి- చీరాల : చీరాల మండలం ఈపురిపాలెం పంచాయతీ పరిధిలోని ఆటోనగర్ ఎపిఐఐసి స్థలాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, తహశీల్దారు ప్రభాకర్ రావు బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఆటోనగర్ స్థలాన్ని పరిశీలించి పూర్తి నివేదికను ప్రభు త్వానికి అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎపిఐఐసి ప్రతినిధులు పాల్గొన్నారు.










