ఏలూరు టౌన్ : ఏలూరు ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్‌కు కొందరు అసంబద్ధంగా, నిబంధనలకి విరుద్ధంగా నిర్వహిస్తున్న ఎన్నికలను నిలుపుదల చేయాలని అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మాగంటి నాగభూషణం డిమాండ్ చేశారు. ఎన్నికలను సక్రమంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఆటోనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసోసియేషన్‌కు అడహక్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్నికల్లో ఎక్కడా నిబంధనలు పాటించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని తెలిపారు.










