May 16,2023 01:23
గుల్లపల్లి ప్రసాద్‌ హాస్పిటల్‌ వద్ద మజ్జిగ పంపిణీ చేస్తున్న ఆటో యూనియన్‌ సభ్యులు

ప్రజాశక్తి-చెరుకుపల్లి: వేసవి తాపాన్ని నివారించేందుకు గుళ్లపల్లి శ్రీ లక్ష్మీ గణపతి ఆటో యూనియన్‌ సభ్యులు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుళ్లపల్లి ప్రసాద్‌ హాస్పిటల్‌ వద్ద ఉన్న ఆటో యూనియన్‌ వద్ద సోమవారం 500 మందికి మజ్జిగను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆటో యూనియన్‌ అధ్యక్షుడు మామిళ్లపల్లి నరేంద్రబాబు, పలువురు సభ్యులు పాల్గొన్నారు.