Aug 16,2023 23:38

ఆటో వర్కర్స్‌ మహాసభలను జయప్రదం చేయండి
ప్రజాశక్తి-పుత్తూరు టౌన్‌: ఆటో వర్కర్స్‌ జిల్లా మహాసభలు ఈ నెల 27వ తేదీన శ్రీకాళహస్తి సీఐటీయూ ఆఫీస్‌లో జరగ నున్నట్లు బుధవారం పుత్తూరు అంబేద్కర్‌ సర్కిల్‌లో సిఐటి యు నాయకులు కరపత్రాలు విడుదల చేశారు. ఈ సంద ర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్‌ వెంకటేష్‌, ఆటో యూ నియన్‌ కార్యదర్శి మురళి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, ట్యాక్సీ పెనాల్టీలను పెంచడం తో ఆటో వర్కర్లు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో వర్కర్లలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఈ చలానా వెంటనే రద్దు చేయాలని, ప్రైవేట్‌ ఆటో ఫైనాన్స్‌ అక్రమాల నుండి కాపాడాలని, ఆటో స్టాండ్‌ ప్రతి కూడలిలో అనుమతి ఇవ్వాలని, జీవో నెంబర్‌ 21ని రద్దు చేయాలని, ఆటోలకు బ్యాంకు ద్వారా సబ్సిడీ లోన్‌ తో రుణాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పైన తెలిపిన సమస్యలపై ఈ మహాసభ ల్లో భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తామని, ఆటో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో నా యకులు పురుషోత్తం, విజరు, సుధాకర్‌, ప్రవీణ్‌ కుమార్‌, ర మేష్‌, సుబ్రమణ్యం, కే వెంకటేష్‌ (కె.వి.పురం), వెంకటేష్‌ (కె.బి.ఆర్‌.పురం), నాయుడు, హరీష్‌ పాల్గొన్నారు.