Oct 10,2023 22:24

అధికార పార్టీ నాయకులతో స్థానికుల వాగ్వాదం

ప్రజాశక్తి-హిందూపురం : పట్టణంలోని ఆటో నగర్‌లో అధికార పార్టీ నాయకులకు, కౌన్సిలర్‌కు చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం జగనన్న సురక్ష కార్యక్రమంలో కౌన్సిలర్‌ సునీత వెంకటేష్‌ రెడ్డి, బి బ్లాక్‌ కన్వీనర్‌ వాల్మికి నరేష్‌తో పాటు ఇతర పార్టీ నాయకులు అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నారు. స్థానిక యువకులు వారి ర్యాలీని అడ్డుకున్నారు. ఆటోనగర్‌లో ప్రజలకు అవసరమైన కనీస మౌళిక సదుపాయాలు లేవని, మౌళిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరిస్తామని సహకరించాలని ఆటోనగర్‌ యువకులకు నాయకులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.