స్థలాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్, ఎమ్మెల్యే
ప్రజాశక్తి - పల్నాడు : పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు కేశానుపల్లి వద్ద ఉన్న 18 ఎకరాల ప్రభుత్వ భూమిని జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శుక్రవారం పరిశీలించారు. మైనర్ ఇరిగేషన్ కాల్వ, హై టెన్షన్ విద్యుత్ వైర్ల విషయమై సంబంధిత అధికారులతో చర్చించారు. ఆటో నగర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అనంతరం పెద్దతురకపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న మైనారిటీ హాస్టల్, ఎస్టీ హాస్టల్ భవనాలను పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయించాలని అధికారులకు సూచించారు. పరిశీలనలో ఆర్డీవో ఎం.శేషిరెడ్డి, తహశీల్దార్ రమణనాయక్, ఎపిఐఐసి, గిరిజన సంక్షేమ, మైనారిటీ శాఖ అధికారులు పాల్గొన్నారు.










