పార్వతీపురంటౌన్: ఆటో కార్మికులంతా ఐకమత్యంతో ఉండాలని సిఐటియు నాయకులు వి.ఇందిర, గొర్లి వెంకటరమణ అన్నారు. శనివారం కొత్తవలస వద్ద గల టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర కొత్తగా ఏర్పడిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆటో వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జెండా వారు ఎగురవేశారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ ఆటో వర్కర్లంతా ఐక్యంగా ఉండాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో వర్కర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పెట్రోల్, డీజిల్ భారాలు తగ్గించాలని, స్వయం ఉపాధి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆటో వర్కర్లను పన్నుల భారం నుంచి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అనంతరం యూనియన్ అధ్యక్షులుగా జి.చరణ్‌కుమార్, ఉపాధ్యక్షులుగా శంకర్రావు, కార్యదర్శిగా దుర్గారావు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో పట్టణ ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు చిన్న, ప్రసాదు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు.










