
ఆటో కార్మికులపై పోలీసుల వేధింపులు మానుకోవాలి: సిఐటియు
ప్రజాశక్తి-నందికొట్కూరు టౌన్
ఆటో కార్మికులపై పోలీసుల వేధింపులు మానుకోవాలని సిఐటియు జిల్లా నాయకులు టి గోపాలకృష్ణ, వ్యాకాస జిల్లా నాయకులు పీ.పక్కిరి సాహెబ్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక భరత్ కాంప్లెక్స్ లో అప్పి ఆటో కార్మికుల సమావేశం అయ్యన్న అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు టి గోపాలకృష్ణ, వ్యాకాస జిల్లా నాయకులు పి పకీర్ సాహెబ్ మాట్లాడుతూ... ఆటో కార్మికులు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాక బతుకుతెరువు కోసం ప్రైవేటు ఫైనాన్స్ లో ఆటోలు తెచ్చుకొని కుటుంబాలని పోషించుకుంటున్న ఆటో కార్మికులపై పోలీసులు ఓవర్ లోడ్ పేరుతో వేధింపులకు గురిచేస్తూ వేలకు వేలు ఫైన్లు వేస్తూ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ పెంచుతున్నాయని మరోవైపు నిత్యవసర వస్తున్న ధరలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు, రోజురోజుకు పెరుగుతున్న ధరలు తగ్గించాలని పెట్రోల్ డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తేవాలని లైసెన్స్ కలిగిన ప్రతి ఆటో కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఆటో డ్రైవర్ కు ఏడాదికి రూ 10,000 ఇవ్వాలని ఫైనాన్సర్ల వేధింపులు ఆపాలని, వడ్డీ మాఫీ చేయాలన్నారు, వెంటనే ఆటో కార్మికులపై వేధింపులు మానుకోకపోతే భవిష్యత్తు ఆటో కార్మికుల ఐక్య కార్యచరణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిరయ్య, వెంకట్ రెడ్డి, జమాల్, శివుడు గౌడు, మున్నా, చిన్న స్వామి, తదితర అప్పి ఆటో కార్మికులు పాల్గొన్నారు.