ప్రజాశక్తి - ఆదోని
ఆటో నగర్‌లో పట్టాల కోసం డబ్బులు చెల్లించిన ఆటో కార్మికులతో పాటు కొత్త వారికి కూడా వెంటనే పట్టాలిచ్చి ఆదుకోవాలని సిఐటియు సీనియర్ నాయకులు మహానంద రెడ్డి, అధ్యక్ష, కార్యదర్శులు తిప్పన్న, గోపాల్, సహాయ కార్యదర్శి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. బుధవారం కొత్త బస్టాండ్ స్టాండ్ ఆటో కార్మికులకు యూనియన్ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఈఎస్‌ఐ, పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, ప్రమాద బీమా ఆటో కార్మికులకు వర్తింపజేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు డీజిల్ సబ్సిడీ కల్పించాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులు ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రజల సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. కొత్తబస్టాండ్ ఆటో యూనియన్ నాయకులు మహేష్, రాము పాల్గొన్నారు.
ఆటో డ్రైవర్లకు యూనియన్ గుర్తింపు కార్డులు ఇస్తున్న నాయకులు










