ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
జమ్మలమడుగు : రాష్ట్ర ప్రభు త్వం ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, వారిని ఆదుకోవాలి అని (ఆటో వర్కర్స్ యూని యన్ సిఐటియు అనుబం ధం) పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఆదాము, ప్రసాద్ రెడ్డి కోరారు. స్థానిక ఎన్‌జిఒ హోంలో బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే ఆటో కార్మికులను ఆదుకోవడానికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. నిత్యం ప్రజా రవాణాలో ఆటో రంగం కీలకంగా వ్యవహరిస్తోందన్నారు. బేషరత్తుగా బ్యాంకు రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సహకరించాలన్నారు. సమావేశంలో కృష్ణారెడ్డి పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఆటో యూనియన్ నాయకులు










