ఆటో డ్రైవర్లకు సిఐ సూచనలు
ప్రజాశక్తి-ఉదయగిరి : మండలులోని ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించాలని నిబంధనలు ఉల్లఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్థానిక పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వి.గిరిబాబు పేర్కొ న్నారు. ఆయన శుక్రవారం మండలంలోని ఆటోడ్రైవర్లకు స్టేషన్ ఆవరణలో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు డ్రైవింగ్ లైసెన్స్ వాహన ధృవపత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. యూనిఫాంరం వేసుకుని నడపాలన్నారు. ఆటోల్లో ఫోక్సలైట్లు, సౌండ్ బాక్స్‌లు ఉంటే వెంటనే తొలగించాలన్నారు. సోమవారం నుండి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని మితిమీరిన వేగం పనికిరాదన్నారు. ఆటోలో ఎక్కే మహిళలపై మర్యాద పూర్వకంగా వ్యవహరించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే రూ.10వేలు జరిమానా విధిస్తామన్నారు. లేదా 15రోజులు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ కార్నటి ఇంద్రసేనారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.










