ఫొటో : అవగాహన కల్పిస్తున్న ఎస్‌ఐ విశ్వనాధ్ రెడ్డి
ఆటో డ్రైవర్లకు అవగాహన
ప్రజాశక్తి-మర్రిపాడు : జిల్లా ఎస్‌పి ఆదేశాల మేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆటో డ్రైవర్లకు శుక్రవారం ఎస్‌ఐ విశ్వనాధ్ రెడ్డి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటోలో ప్రయాణం ప్రమాదకరమని పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని హెచ్చరించారు. వాహనాలకు సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలతో పాటు యూనిఫారం ధరించాలన్నారు. ఆటోలలో ప్రయాణించే మహిళలపై మర్యాదపూర్వకంగా నడుచుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎఎస్‌ఐ రామచంద్రయ్య పాల్గొన్నారు.










