Aug 16,2023 19:52

ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్న ఎంవిఐ ఎస్‌కె ఎమ్‌డి రఫీ

ప్రజాశక్తి-కందుకూరు :జిల్లా జిల్లా ఉప రవాణా కమిషనరు బి. చందర్‌ ఆదేశాలమేరకు బుధవారం కందుకూరు మోటారు వాహనాల తనిఖీ అధికారి కార్యాలయంలో ఆటో డ్రైవర్లుకు రహదారి భద్రత పై అవగాహనా సదస్సును నిర్వహించారు. కందుకూరు మోటారు వాహనముల తనిఖీ అధికారి ఎస్‌. కె . యండి. రఫీ మాట్లాడారు. కందుకూరు ఎం. వి. ఐ ఆఫీస్‌ పరిధిలోని ఉలవపాడు, గుడ్లూరు, వలేటివారిపాలెం, లింగసముద్రం కందుకూరు పరిధిలో ఉన్న ఆటో డ్రైవర్లకు తమ ఆటోలలో పరిమితికి మించి ప్రమాదకరమైన రీతిలో ప్రయాణికులను ఎక్కించుకుని ప్రయాణం చేయొద్దని సూచించాచరు. ప్రతి ఒక్కరు వాహనాలకు సంబంధించిన ఇన్సూరెన్సు , ఫిట్నెస్‌, పొల్యూషన్‌ ధ్రువపత్రాలను డ్రైవింగ్‌ లైసెన్స్‌ను అందుబాటులో ఉంచుకోవాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.