అతను మోస్తూనే ఉన్నాడు
ఒకటీ రెండు రోజులు కాదు
తరతరాలుగా చేస్తున్నాడు
వానలో తడిచి ముద్దవుతాడు
ఎండలో ఎండిన కట్టెవుతాడు
బండలా మొండిగా నిలుస్తాడు
దేని కోసం ...? ఎవరి కోసం...?
నాలుగు మెతుకుల పెంపు కోసం
నాలుగు పొట్టలు నింపడం కోసం
అతని కోసం మనమేం చేస్తున్నాం?
లఖింపూర్లో ట్రాక్టర్లతో తొక్కిస్తే చూస్తున్నాం
నలుగురికీ మెతుకులు మిగల్చడానికి
జరిపే పోరులో బలౌతుంటే కళ్లప్పగిస్తున్నాం
అతనే లేకుంటే ... రైతు ఉనికి మాయమైతే
నువ్వూ ... నేను మనమేమౌతాం ?
ఇప్పుడు యోచించకుంటే
రేపు నిన్నూ నన్ను గురించి
ఆలోచించే అవకాశం మిగలదు
ఉన్నం వెంకటేశ్వర్లు
87900 68814