Aug 02,2021 18:17

కడప : అతని అందంతో అమ్మాయిలకు వల విసిరి, సామాజిక మాధ్యమాల్లో పరిచయాలు పెంచుకొని.. వారి అర్థనగ్న చిత్రాలు తీసుకున్న తర్వాత అసలు రూపం బయటపెడతాడు. పరువు పోతుందని మహిళలు అతను అడిగిన డబ్బులను, నగలను ఇచ్చేవారు. కడప తాలుకా పోలీసులు ఈ మోసగాడిని అరెస్టు చేసి.. తన దగ్గర నుంచి 1.26 లక్షల నగదు, 30 గ్రాముల నగలు స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కడప డీఎస్పీ సునీల్‌ తెలిపిన వివరాల ప్రకారం..
'కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన చెన్నుపల్లి ప్రసన్నకుమార్‌ అలియాస్‌ ప్రశాంత్‌రెడ్డి అలియాస్‌ రాజారెడ్డి అలియాస్‌ టోనీ ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరంలోనే చదువు మానేసి జల్సాలకు అలవాటు పడ్డాడు. 2017లో దొంగతనాలకు పాల్పడి జైలుకు కూడా వెళ్లాడు. తాజాగా జూలై 29న ఓ చోరీ కేసులో ప్రసన్నకుమార్‌ని పోలీసులు అరెస్టు చేస విచారించగా..విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ప్రసన్నకుమార్‌ కడప, విజయవాడ, హైదరాబాద్‌ తదితర నగరాల్లో ఫేస్‌బుక్‌, షేర్‌చాట్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర నగరాల్లో ఫేస్‌బుక్‌, షేర్‌చాట్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా యువతులు, మధ్య వయసు మహిళలతో పరిచయం పెంచుకుని.. మాయమాటలతో ప్రేమలోకి దించేవాడు. వారితో చాటింగ్‌ చేస్తూ, వారి నగ్న, అర్థనగ్న చిత్రాలను, వీడియోలను సేవ్‌ చేసుకుని, బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేసేవాడు. లేదంటే వారి నగ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించాడు. సుమారు 200మంది యువతులు, వందమంది మహిళలను మోసం చేశాడు. అతని ఫోన్లో అన్నీ మహిళలు, అమ్మాయిల చిత్రాలే ఉన్నాయి' అని డీఎస్పీ తెలిపారు.