Apr 01,2023 00:14
మాట్లాడుతున్న కావూరి రఘుచంద్‌

ప్రజాశక్తి-అద్దంకి: పదో తరగతి విద్యార్థులకు జన విజ్ఞాన వేదిక ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాస తరగతులు సింగరకొండ రోడ్డులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరాల చిన్న గురవయ్య అధ్యక్షత వహించారు. ప్రజారోగ్య వేదిక జిల్లా అధ్యక్షులు కావూరి రఘు చందు మాట్లాడుతూ ఏప్రిల్‌ మూడో తేదీ నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు భయాన్ని వీడి ఆత్మస్థైర్యంతో పరీక్షలు రాయాలని, అందుకు సరైన నిద్ర, ఆహారం కూడా ఆరోగ్య విషయంలో ప్రధాన పాత్ర వహిస్తాయని రోడ్ల వెంబటి తినుబండారాలే అనారోగ్యానికి కారణాలని రఘుచందు అన్నారు జనవిజ్ఞానవేదిక గౌరవ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు మాట్లాడుతూ తల్లిదండ్రులను గురువులను గౌరవిస్తూ చదువుతోపాటు విలువైన సమాజాన్ని కూడా చదివిన వారే ఉన్నత స్థితికి చేరుకోగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వేమూరి రామకృష్ణ, సంధిరెడ్డి పద్మావతి, శ్రీహరి, హైస్కూల్‌ అభివృద్ధి కమిటీ సభ్యులు బావోజి తదితరులు పాల్గొన్నారు.