Jun 17,2023 20:42

ఎమ్మెల్యేను, నాయకులను సన్మానిస్తున్న వికలాంగులు

ప్రజాశక్తి - మంత్రాలయం
వికలాంగులు ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి కోరారు. శనివారం ఎమ్మెల్యే స్వగ్రామమైన రాంపురంలో వికలాంగులకు ట్రై మోటార్‌ సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైసిపి పాలనలో వికలాంగులకే కాకుండా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. వికలాంగులు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని కొనియాడారు. మొదటి విడత కింద 5, రెండో విడత కింద 5 మొత్తం 10 ట్రై మోటార్‌ సైకిళ్లు పంపిణీ చేశారు. రాష్ట్ర వికలాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ ఛైర్మన్‌ ముంతాజ్‌ పఠాన్‌, వైసిపి మండల అధ్యక్షులు జి.భీమిరెడ్డి, వైసిపి పెద్దకడుబూరు మండల అధ్యక్షులు రామ్మోహన్‌ రెడ్డి, రోడ్డు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, ఎమ్మెల్యే పిఎ వెంకట్రామి రెడ్డి, రవి చంద్ర రెడ్డి పాల్గొన్నారు.