ఆత్మకూరులో 'స్వచ్ఛత హి సేవా'
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని కాశీనాయన ఆశ్రమం ప్రాంగణంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గోపారం వెంకటరమణమ్మ, మున్సిపల్ కమిషనర్ బి.నాగేశ్వరరావు స్వచ్ఛతహి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు వారు చీపురు పట్టి చెత్తను ఊడ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ పి.నాగేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో స్వచ్ఛతను పాటించాలని, అందరూ కలిసి బాపూజీ కలలను సాకారం చేద్దామన్నారు. పరిసరాలు శుభ్రత లేకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉండటం సాధ్యం కాదని స్వచ్ఛభారత్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలని తద్వారా రోగాల వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ ప్రసాద్, మున్సిపల్ ఆర్‌ఐ ఖాసీం, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.










