ఆత్మకూరు వైసిపి పట్టణ అధ్యక్షుడుగా సయ్యద్ మీర్
ప్రజాశక్తి - ఆత్మకూర్
ఆత్మకూర్ పట్టణ వైసిపి అధ్యక్షుడిగా సయ్యద్ మీర్‌ను ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి శుక్రవారం ప్రకటించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సయ్యద్ మీర్ ఆత్మకూరు పట్టణ అధ్యక్షుడిగా కొనసాగుతా రని తెలిపారు. అనంతరం పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు నూతన అధ్యక్షుని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సయ్యద్ మీర్ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులను కార్యకర్తలను కలుపుకొని పోతూ పార్టీ ఇచ్చిన అన్ని కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యుడు ఎంఏ రషీద్, కౌన్సిలర్లు విజరు చౌదరి, సుల్తాన్, మారుబోతుల విజరు గౌస్, రాజం, యూనిస్ పాణ్యం, పార్వతి, తదితరులు పాల్గొన్నారు.










