Jun 27,2023 22:00

ఫొటో : జెండా ఊపి బస్సును ప్రారంభిస్తున్న మాలేపాటి సుబ్బానాయుడు

ఆత్మీయ సమావేశానికి తరలిన టిడిపి నాయకులు
ప్రజాశక్తి-కావలి : మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన ''మాలల ఆత్మీయ సమావేశం'' కార్యక్రమానికి కావలి నియోజకవర్గం నుండి 40 మంది టిడిపి మాల నాయకులు బయలుదేరి వెళ్లారు. వీరి వాహనానికి కావలి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్‌సిసెల్‌ అధికార ప్రతినిధి ఆత్మకూరి నాగరాజు, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, పార్టీ ముఖ్య నాయకులు గోల్ల శ్రీను, కమతం ప్రసాద్‌, దార్ల శివకుమార్‌, వసంతరావు, ఇనగంటి అనిల్‌, బాబు, మోడేగుంట శ్రీనివాసులు, బొల్ల వేణు, కోవూరు సునీల్‌, రాజశేఖర్‌, శ్రీహరి, కమతం శ్రీను, ముక్కు గోపాల్‌, మారుపూడి గోపి, మరి కొంతమంది పాల్గొన్నారు.