ప్రజశక్తి - చీరాల
సమస్య ఎదురైనప్పుడు ధైర్యంగా పోరాడాలని, ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని మానసిక వైద్య అన్నారు. రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాలలో భాగంగా ఈపూరిపాలెం జెడ్‌పి బాలికల ఉన్నత పాఠశాలలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం గురించి అవగాహన కల్పించారు. డాక్టర్ పి సందీప్, డాక్టర్ ఎస్ కొండలరావు, డాక్టర్ ఐ బాబూరావు మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 40సెంకడ్లకు ఒకరు చొప్పున సంవత్సరానికి 8లక్షలు మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. మన దేశంలో మహిళలు 3వ స్థానంలో వున్నారని తెలిపారు. మానసిక వత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా చదువుకోవాలని అన్నారు. సమస్యలుంటే స్నేహితులతో పంచుకుంటే వత్తిడి తగ్గుతుందని అన్నారు. కార్యక్రమంలో మామిడాల శ్రీనివాసరావు, పోలుదాసు రామకృష్ణ, డివి సురేష్, జివై ప్రసాద్ పాల్గొన్నారు.










