ఉత్సాహంగా ఆటల పోటీలు
ప్రజాశక్తి-డుంబ్రిగూడ:మండల కేంద్రంలోని గ్రంధాలయంలో చిన్నారుల సమ్మర్ క్యాంప్ కొనసాగుతుంది. ఈ సందర్భంగా శనివారం చిన్నారులకు ఖోఖో పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 30 మంది చిన్నారులు పాల్గొన్నారు. అనంతరం గ్రంథాలయ అధికారిని సునీత మాట్లాడుతూ చిన్నారులకు అటల పోటీలు ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సిబ్బంది చిన్నారులు పాల్గొన్నారు.










