Aug 05,2023 22:30

బ్యాడ్మింటిన్‌ ఆడుతున్న జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

* జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌: 
నిత్యం పని ఒత్తిడిలో ఉండే న్యాయవాదులకు, జిల్లా కోర్టు ఉద్యోగులకు ఆటలు ఎంతో మానసిక శారీరక ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తాయని జిల్లా జడ్జి అహ్మద్‌ మౌలానా అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన శాంతినగర్‌ కాలనీలో ఉన్న ఇండోర్‌ స్టేడియంలో బ్యాడ్మింటన్‌ పోటీలను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటల్లో గెలుపు ఓటములు సహజమని, ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని చాటాలని కోరారు. ఈ పోటీల్లో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడితో కలిసి బ్యాడ్మింటెన్‌ ఆడారు. జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు సూర్యారావు మాట్లాడుతూ ఈ నెల 3 నుంచి ప్రారంభమైన ఆటల పోటీలు 14 వరకు కొనసాగుతాయని తెలిపారు. ఆసక్తి ఉన్న సీనియర్‌, జూనియర్‌, మహిళ న్యాయవాదులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాలుగో అదనపు జడ్జి ఎస్‌.ఎం.ఫణికుమార్‌, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు, న్యాయవాదులు గేదెల వాసుదేవరావు, జి.లక్ష్మి, భైరి దామోదరరావు, సనపల హరి, స్పోర్ట్స్‌ కార్యదర్శి గంగు భాస్కరరావు, పైడి విశ్వేశ్వరరావు, హరిప్రియ, జి.అనిల్‌కుమార్‌, ఆర్‌.కుసుమ, మజ్జి సుదాబాల, గొద్దు భాగ్యలక్ష్మి, కె.సత్యవాణి, పి.పద్మజ పాల్గొన్నారు.