ప్రజాశక్తి-పర్చూరు : యువతను ప్రోత్సహించేందుకు క్రీడలు ఉపయోగపడతాయని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. పర్చూరు అద్దంకి నాంచారమ్మ కళ్యాణ మండపంలో అఖిల భారత స్థాయి ఎన్‌టిఆర్ టి-20 క్రికెట్ పోటీలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్‌టిఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఏలూరి యూత్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పర్చూరులోని రిగ్వేద్ క్రికెట్ ప్రాంగణంలో ఈ పోటీలను మే 12 నుంచి 21 వరకూ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విజేతలకు ప్రథమగా బహుమతి రూ.5 లక్షలు, ద్వితీయ బహుమతిగా రూ. 3 లక్షలు, తృతీయ బహుమతిగా రూ.2 లక్షలు, నాలుగో బహుమతి రూ.1 లక్ష నగదు అందజేయనున్నట్లు ట్రస్టు ప్రతినిధి తులసి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల శేషగిరిరావు, మానం హరిబాబు, షేక్ షంషుద్దీన్, ఎవి.కృష్ణ, ఎం. హరిప్రసాద్, బి.రామాంజనేయులు పాల్గొన్నారు. తొలుత మసీదు నిర్వహించిన ప్రార్ధనలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి అల్పాహార విందులో పాల్గొన్నారు. అనంతరం ఉప్పుటూరులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.










