ప్రజాశక్తి-తిరువూరు
సంక్రాంతి పండుగను పురస్కరించు కుని భారత ప్రజాతంత్ర యువజన సమైఖ్య (డివైఎఫ్ ఐ), భారత విద్యార్థి ఫెడరే షన్ (ఎస్‌ఎఫ్ ఐ), జనవిజ్ఞానవే దిక (జెవివి), అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా), ప్రజానాట్య మండలి (పిఎన్ ఎం), సిఐటియు, సుందరయ్య విజ్ఞానకేంద్రం ఆధ్వర్యం లో తిరువూరు మండల స్థాయిలో నిర్వహించనున్న ఆటల పోటీల కరపత్రాలను గురువారం స్థానిక పంచాయతీరాజ్ కార్యాలయం షటిల్ కోర్టు వద్ద ఆవిష్కరించారు. ఎంపిడిఓ కార్యాల యం రోడ్డులో గల కన్యకా పర మేశ్వరి గుడి స్థలంలో ఈనెల 10, 11వ తేదీన షటిల్ డబల్స్ టోర్నమెంట్, 12వ తేదీ న డాన్స్, పాటల పోటీలు నిర్వహిస్తు న్నట్లు ప్రజా సంఘాల నాయకులు తెలి పారు. ఈకార్యక్రమంలో డివైఎఫ్‌ఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఎన్. నాగేశ్వర రావు, జనవిజ్ఞానవేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.గంగాధ రరావు, జెవివి చెకుముకి కన్వీనర్ ఎమ్.హరికష్ణ, సిఐటియు మండల కార్యదర్శి బి.వెంక టేశ్వరరావు, షటిల్ ప్లేయర్స్ సిహెచ్. వెంకటరెడ్డి, డి.లక్ష్మీనారాయణ, సిహెచ్.రామకష్ణ, ఎస్.కష్ణ ప్రసాద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.










